“బాలయ్య 109”కి అదిరిపోయే టైటిల్ ఫిక్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ నటులు ఊర్వశి రౌటేలా అలాగే బాబీ డియోల్ లు ముఖ్య పాత్రల్లో వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ సాలిడ్ యాక్షన్ చిత్రం గురించి అందరికి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఎలక్షన్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ ని అయితే ఆరంభించారు. ఇక ఇపుడు షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక వార్త వైరల్ గా మారింది.
ఈ చిత్రానికి మొదటగా వీర మాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరిన్ని వైరల్ గా మారాయి. టీజర్ గ్లింప్స్ లో చెప్పినట్టుగా అసురుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందని లేటెస్ట్ అప్డేట్, కాగా దీనితో పాటుగా డెమోన్ అనే టైటిల్ కూడా బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు అని ఫిలింనగర్ వర్గాల్లో చర్చగా మారింది. మొత్తానికి అయితే బాబీ ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారు అనేది మరి కొంత కాలం ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశి & సాయి సౌజన్య లు నిర్మాతలుగా చేస్తున్న సంగతి తెలిసేందే
For More Updates Follow The Film Nagar