కల్కి పార్ట్ 2 లో ఆ రోల్ రామ్ చరణ్ కి పడితే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు లైన్లు కడుతున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది.
ఇదిలా ఉండగా కల్కి పార్ట్-2 కూడా ఉండబోతుందని వారి మాటల ద్వారా తెలిసింది. మరో పక్క సోషల్ మీడియా లో కల్కి పాత్రలో రామ్ చరణ్ ఎలా ఉంటాడు అనే చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ కల్కి గెటప్ ఎడిట్స్ స్టార్ట్ చేసేసారు.
ఏదేమైనా నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 లో కల్కి పాత్ర ఎవరికీ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతుంది.
కాకపోతే వైజయంతి టీం ఏం ప్లాన్ లో ఉందో ఇప్పుడప్పుడే బయటకి వచ్చేలా లేదు. నాగఅశ్విన్ మహాభారత యుద్ధంతో మొదలుపెట్టి, కృష్ణుడు అవతారం చాలించే ఘట్టం నుంచి కలియుగంలో కల్కి ఆవిర్భావం దాకా జరిగే పరిణామాలకు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ని జోడించి మూడు సరికొత్త ప్రపంచాల్లోకి తీసుకుపోతున్నాడు అనేది స్పష్టం అవుతుంది.