“రాజాసాబ్” గ్లింప్స్ వచ్చేది అప్పుడే..!
ప్రభాస్ – మారుతి ఇరువురి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’ అన్న సంగతి తెలిసిందే. ‘కల్కి’ తరవాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా కావడం విశేషం. దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. సంక్రాంతికి ఫస్ట్ లుక్ మినహా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇంకా ఒక్క పాట కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు చిత్రబృందం రాజాసాబ్ కి సంబంధించి ఓ గ్లింప్స్‌ని విడుదల చేయాలని కసరత్తు చేస్తుంది. ఈనెలాఖారులోగా ఈ గ్లింప్స్‌ని విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ మాస్ ఎంట్రీతో ఈ లుక్ ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు అని టాక్.
ఓవైపు కల్కి, మరోవైపు సలార్ చేస్తూనే ప్రభాస్ అప్పుడప్పుడూ ‘రాజాసాబ్’కు డేట్లు ఇస్తూ సినిమా చేసాడు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాయి కాబట్టి. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. ఈ నెల చివరలో ఆయన ఇండియా తిరిగొస్తారు. వచ్చాక నేరుగా ‘రాజాసాబ్’ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ టైములో ‘రాజాసాబ్’ గ్లింప్స్ విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ ప్రభాస్ లేని పోర్షన్ని మారుతి పూర్తి చేసారని, ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయన 4 పాటల్ని పూర్తి చేసారు. అందులో ‘రాజాసాబ్’ టైటిట్ ట్రాక్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు రిలీజ్ చేయబోయే ఈ గ్లింప్స్‌లో ఈ టైటిల్ ట్రాక్ వినిపించబోతోంది.
For more updates: The Film Nagar