రాజ్ తరుణ్ కెరీర్ డైలమాలో..?
రాజ్ తరుణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో పెద్ద స్టార్ అవుతారని అందరూ భావించారు కానీ రాజ్ తరుణ్ కెరీర్ డౌన్ అవ్వడం మొదలైంది. అయితే… అనూహ్యంగా రాజ్ తరుణ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు కనపడుతున్నాడు. వరుసగా 5 ప్రాజెక్టులు చేస్తున్నాడు అందులో ఒక సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో రెండు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. మరో రెండు స్క్రిప్టు దశలో మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇందులో ఒక్క సినిమా హిట్ పడినా, మరో రెండేళ్లు రాజ్ తరుణ్ కి తిరుగులేదు. అయితే.. ఇంతలోనే రాజ్ తరుణ్ – కేసులు, గొడవల్లో ఇరుక్కున్నాడు. ఈమధ్యనే లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ తనని వివాహం చేసుకొని మోసం చేశాడని, మరో హీరోయిన్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని తనని వదిలేసాడని తనకు న్యాయం చేయాలని లావణ్య ఇటీవలే పోలీస్‌స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ కూడా తనపై వచ్చిన అభియోగాలు తిప్పికొట్టాడు.
ఈ విషయంలో తన తప్పు లేదని, లావణ్యని భరించలేకే దూరంగా ఉంటున్నానని మీడియాతో చెప్పాడు. ఇది పోలీసులు, కోర్టుల గొడవ. ఇలాంటి సున్నితమైన విషయాల్లో వీళ్లది తప్పు, అయితే, ఇలాంటి వ్యవహారాల వల్ల కెరీర్లు చిక్కుల్లో పడ్తాయి. రాజ్ తరుణ్‌కి ఇప్పుడు అలాంటి భయమే పట్టుకుంది. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ కి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో రాజ్ తరుణ్ పరిస్థితి కొంచెం అయోమయంలో పడ్డట్లే..!
Form more updates: The Film Nagar