మహేష్ – రాజమౌళి చిత్రంలో విలన్ గా పృథ్వీరాజ్?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో విలక్షణ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు, ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో విలన్ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ని ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రావడం విశేషం. రాజమౌళి మరియు పృథ్వీరాజ్ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు రావడంతో మరియు స్క్రిప్ట్ అతనిని ఉత్తేజపరిచినందున అతని ఓకే అన్నట్టు సమాచారం.
రాజమౌళి తన హీరో కి విలన్ కి మధ్య సన్నివేశాలు సరికొత్తగా ఉండబోతున్నాయి. పృథ్వీరాజ్ పాత్ర వేరే లెవెల్లో ఉండనుంది అని తెలుస్తోంది. స్క్రిప్ట్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఏ వార్త నిజమని తేలితే, ఒకే ఫ్రేమ్‌లో మహేష్ పృథ్వీరాజ్ వంటి దిగ్గజాలు చూడటం పండుగ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని ఎంటర్టైనర్‌ను దుర్గా ఆర్ట్స్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు అందించనున్నారు.
For More Update Follow The Film Nagar