“విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్.!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల తార త్రిష హీరోయిన్ గా బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.
అదేంటంటే ప్రస్తుతం చిరంజీవి యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే సినిమాలో ఈ సీక్వెన్స్ సినిమాకి మెయిన్ అస్సెట్ అని టాక్. ఇక ఈ భారీ సినిమాని విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న చోటా కే నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
For More Updates Follow The Film Nagar