“గేమ్ ఛేంజర్” సాంగ్స్ విజువల్స్ పై హైప్ పెరిగేలా ఉందే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలనాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “గేమ్ ఛేంజర్”. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకి చేరింది, కానీ ఇంకోవైపు శంకర్ ఇప్పుడు కమల్ తో చేసిన భారీ చిత్రం “భారతీయుడు 2” ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం కూడా శంకర్ మార్క్ లెవెల్లో గ్రాండియర్ గా కనిపిస్తుండగా నిన్న విదులైన క్యాలెండర్ లిరికల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో విజువల్స్ చూసి అంతా స్టన్ అవుతున్నారు దర్శకుడు శంకర్ తన సినిమాల పాటల చిత్రీకరణ విషయం లో ఎలాంటి రాజి పడదు. అయితే గేమ్ ఛేంజర్ సాంగ్స్ పట్ల అభిమానులు ఒక అంచనాకి వచ్చేసారు.
ఇప్పటికే రిలీజైన జరగండి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మిగతా సాంగ్స్ విషయంలో కూడా ఖచ్చితంగా శంకర్ తన మార్కుతో గ్రాండ్ ట్రీట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి కూడా భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టుగా దిల్ రాజు తెలిపారు. మరి విజువల్ గా ఎలా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
For More Updates Follow The Film Nagar