గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వనుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ రిలీజ్ చేస్తున్నట్టుగా ధనుష్ “రాయన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెవీల్ చేసేసారు.
ఈ వార్తతో అభిమానులు కాస్త ఊరట చెందినా కానీ రిలీజ్ డేట్ మాత్రం ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు. క్రిస్మస్ రిలీజ్ కదా అని డిసెంబర్ 25 కి రిలీజ్ చేసే అవకాశం కనపడటం లేదు. మరి ఏ డేట్ లో ఈ సినిమా వస్తుంది అనేది లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ డేట్ లో వస్తే శుక్రవారం ఎలాగు క్రిస్మస్ హాలిడేస్ కలిసొస్తుండడంతో డిసెంబర్ 20 న రిలీజ్ డేట్ సరైందని చిత్ర బృందం అనుకుంటుంది.
శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఎస్ జె సూర్య, అంజలిలు మరియు శ్రీకాంత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
For more updates: The Film Nagar