వైజాగ్లో వరుణ్ తేజ్ మట్కా మూవీ షూటింగ్.
మెగా హీరో వరుణ్ తేజ్: మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’.. నోరా ఫతేహి కీలకపాత్ర పోషిస్తోంది. కరుణ కుమార్ గారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ యాక్షన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన వింటేజ్ వైజాగ్ సెట్స్లో లో గత కొద్ది రోజులుగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. యాక్షన్ సీన్స్‌తో పాటు రెట్రో థీమ్ సాంగ్ షూటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కలర్ఫుల్ పబ్ సెట్లో నోరా ఫతేహీ రెట్రో అవతార్లో కనిపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రపీలో పలువురు గ్రూప్ డ్యాన్సర్స్ గ్రాండ్ ఈ పాటను చిత్రీకరించారు. తాజాగా ఈ లెంగ్త్ షెడ్యూల్ షూట్ పూర్తయింది.. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ షూటింగ్ వైజాగ్లో జరుగుతోందని మేకర్స్ ప్రకటించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. నటుడు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
For More updates: The Film Nagar