భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ మాములుగా లేదుగా
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మార్విక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘భారతీయుడు-2’. అయితే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు పవన్ కల్యాణ్ గురించి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను మూడు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. ఇప్పుడు అది సగం మాత్రం నెరవేరింది. మిగతా సగం కూడా మీరే పూర్తి చెయ్యాలి అంటూ అభిమానులను ఉద్దేశించి ఎస్జే సూర్య మాట్లాడారు.
ఎస్‌జే సూర్య, పవన్ పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆడిటోరియం అంత దద్దరిల్లిపోయింది. అభిమానుల కేకలు ఈలలు అరుపులతో ఆడిటోరియం అదిరిపోయింది. దీంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్‌జే సూర్య స్పీచ్ వీడియో తెగ వైరల్ అవుతుంది.
అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, రవివర్మన్ DOP గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందంతో పాటు మరికొందరు నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.
For more updates: The Film Nagar