హనుమాన్ అవతారం లో రామ్ చరణ్?
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఈ ఏడాది ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా టాప్ లో నిలిచింది. ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ జై హనుమాన్ కూడా రెడీ కాబోతోంది. అయితే హనుమాన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఈ పాత్రలో చిరంజీవిగారు అయితే బావుటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేసారు.
అప్పట్లో ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవి గారిని దృష్టిలో ఉంచుకుని హనుమాన్ ని విగ్రహాన్ని డిజైన్ చేసారని చెప్పాడు. ఇదిలాఉండగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి హనుమాన్ పాత్రకి ఎవరైతే బావుంటారో తన మనసులో చెప్పారు.
” నా పర్శనల్ ఛాయిస్ అయితే రామ్ చరణ్ చేస్తే బాగుంటది. చిరంజీవి గారు కూడా బావుంటారు. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా ఆ పాత్ర అద్భుతంగా ఉంటది అని తెలిపారు.
అయితే ఆ హనుమాన్ పైనే భారం వేశాం అని తెలిపారు. ఇక ఆ హనుమంతుడే నిర్ణయించాలి ఎవరి ద్వారా కథ చెప్పిస్తే బాగుంటుందో అని చెప్పుకొచ్చారు.
హనుమాన్ మూవీ తర్వాత ఈ సంస్థ వారు నిర్మించిన ‘డార్లింగ్’ సినిమా ఈనెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
For more Updates: The Film Nagar