అమ్మాయిగా మారిన విశ్వక్ సేన్..
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ తాను ప్రతి సినిమాకి ఏదొక కొత్తదనంతో ట్రై చేస్తుంటాడు. అలాగే ఇప్పుడు తాను చేయబోయే సినిమాలో ఒక విభిన్న పాత్ర చేయబోతున్నాడు
అదేంటంటే ఒక అమ్మాయి గెటప్ లో విశ్వక్సేన్ కనిపించనుండం విశేషమ్
దర్శకుడు రామ్ నారాయణన్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న చిత్రం “లైలా”. మరి ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ అమ్మాయిగా చాలా అందంగా ఉన్నాడు అనే చెప్పాలి. అలాగే ఈ పోస్టర్ లోనే సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ లాక్ చేసేసారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
For More Updates Follow The Film Nagar