“విశ్వంభర”: మెగాస్టార్ స్పీడ్ మామూలుగలేదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) కాంబినేషన్ లో బింబిసారా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “విశ్వంభర”. అయితే ఈ సినిమా ఒక పక్క షూటింగ్ మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చక చకా పూర్తిచేస్తున్నారు
నేడు సంగీత దర్శకుడు కీరవాణి బర్త్ డే సందర్భంగా చిరు ఒక స్పెషల్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అయితే ఈ అప్డేట్ తో పాటు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు కూడా ఒక సాలీడ్ అప్డేట్ అందించారు. అదేంటంటే ఇవాళ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
దీనితో విశ్వంభర మాత్రం జెట్ స్పీడ్ లో పనులు పూర్తిచేసుకుంటూ చెప్పిన టైంకి రిలీజ్ అవ్వనుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కి కానుకగా రిలీజ్ కి ఫిక్స్ చేసి తీసుకొస్తున్నారు.
For More Updates Follow The Film Nagar