హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ చూశారా?
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల పార్ట్ 1” బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్స్్ప భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినీ నటుడు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్ను బుధవారం రిలీజ్ చేశారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై ఎట్రెడ్ కుమార్ నిర్మించారు.తెలుగు మరియు తమిళంలో ‘విడుదల 2’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..
విడుదల పార్ట్ 1కు మంచి స్పందన
ఈ సందర్భంగా నిర్మాత ఎట్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా ఎంతో సంతోషించాం. విడుదల పార్ట్ 1 అంచనాలను మించి విజయం సాధించింది. నటుడు సూరికి ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మహారాజ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.
For more updates: The Film Nagar