సమంత పై విమర్శల వర్షం కారణం ఇదే..!
సినీ నటి సమంత రీసెంట్ గా హెల్త్ రిలేటెడ్ ఒక పోస్ట్ చేసింది దీనిపై పలువురు వైద్య నిపుణులు బాహాటంగానే విమర్శలు చేసారు.. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు మరికొందరు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు.
సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ తనకు బాగా పని చేసిందని.. మిగతా మెడిసిన్స్ ని ఒద్దు అంటూ ఆమె ఒక ఆరోగ్య చిట్కా చెప్పుకొచ్చింది. అయితే దీనిపై పలువురు విమర్శలు సీరియస్ గా రియాక్ట్ అవ్వగా మరికొందరు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సమంతపై విమర్శలు చేయగా.. ఆమెకు మరో టాలీవుడ్ హీరోయిన్ బాసటగా నిలిచారు.
సమంత షేర్ చేసిన ఈ హెల్త్ చిట్కాను పలువురు డాక్టర్లు సైతం తప్పుబడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా నటి సమంతకు ఏమీ తెలియదని.. ఆమెను జైల్లో పెట్టాలని ప్రముఖ వైద్యుడు సిరియాక్ అబ్బి ఫిలిప్స్ పేర్కొన్నారు. అయితే ఈ డాక్టర్ కామెంట్స్ కి సమంత అంతే స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. తాజాగా సమంతపై నటి, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా కామెంట్స్ చేశారు. ‘మిలియన్స్ లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కి ఆరోగ్య చిట్కాలు ఇస్తున్న సెలబ్రిటీని నేను ఒకటే ప్రశ్న అడగదలచుకున్నా.. సాయం చేయాలన్న మీ ఉద్దేశం మంచిదే ఐనప్పటికీ. కానీ ఒకవేళ నువ్వు ఇచ్చిన చిట్కా వల్ల సహాయం జరగకపోగా.. ఎవరి ప్రాణానికైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు బాధ్యత వహిస్తావా? లేక నువ్వు ట్యాగ్ చేసిన డాక్టర్ ఏమైనా బాధ్యత వహిస్తారా?’ అంటూ జ్వాలా గుత్తా సమంత కు రిప్లై ఇచ్చారు.ఇదిలా ఉంటె జ్వాలా గుత్తా చేసిన కామెంట్స్ పై నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ‘ఇది తమను తాము సమాజంలో మంచిగా చూపించుకోవడం లో
భాగమే జ్వాలా అంటూ రిప్లై ఇచ్చింది. వీళ్ళు చేసే ప్రకటనల వెనుక కూడా చీకటి కోణం. సెలబ్రిటీలు చక్కెరలు తీసుకోరు. కానీ వాళ్ళు చేసే ప్రకటనలలో కూల్ డ్రింక్ లు, చాక్లెట్లు తీసుకోమని ప్రజలకు చెప్తారు. ఇది రియాలిటీ; అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. దీంతో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
For more updates: The Film Nagar