అఖండ 2 లో మోక్షజ్ఞ స్పెషల్ రోల్.. నిజమేనా ?
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ఒక షోలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ‘అఖండ 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ, ‘అఖండ 2’ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అని టాక్. ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది.
డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ కోసం ఓ స్పెషల్ రోల్ రాసుకున్నాడని.. మూవీ సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ పాత్ర ఎంట్రీ అని సమాచారం. ఇప్పటికే, మోక్షజ్ఞ పై లుక్ టెస్ట్ షూట్ కూడా చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్త గనక నిజం అయితే.. నందమూరి అభిమానులకు ఇక ఇది శుభవార్తే.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే హిందూ దేవాలయాలకి సంబందించిన సన్నివేశాలతోపాటు దక్షిణ భారత దేశ గొప్పతనాన్ని చూపించబోతున్నట్టు సమాచారం. ఇక ‘అఖండ 2’ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు సమాచారం.
For More Updates Follow The Film Nagar