రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డబుల్ రోల్..?
రాజమౌళి – మహేష్ బాబు రాబోయే మూవీ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా (SSMB 29) రానుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది.
అయితే ఈ మూవీ లో రాజమౌళి మహేష్ తో ద్విపాత్రాభినయం చేయించనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్త పై ఎలాంటి ప్రకటనలు చేయలేదు కదా ఖండించనూ లేదు.
ఈ కాంబోలో వస్తున్న చిత్రం పై ఇప్పటికే పృథ్వీ రాజ్ మరియు విక్రమ్ లు నటిస్తున్నారు అనే ఊహాగానాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ రాజమౌళి మాత్రం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంపికలో తలమునకలై ఉన్నారు.
ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా కే ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
For more Updates: The Film Nagar