బాహుబలి 3 తీయాలని రాజమౌళికి ఉందా..? జక్కన్న చేసిన ప్రపోజల్ కు ప్రభాస్ సమాధానం ఏంటి..?
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. ప్రభాస్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తీసుకు వచ్చిన ఈ సినిమాకు రెండు పార్టులుగా రిలీజ్ అయ్యింది. అయితే రెండో భాగంలో మహేంద్ర బాహుబలి రాజు అవ్వడంతో కథ ముగుస్తుంది. అయితే ఈ సినిమాకు మూడో పార్ట్ ఉందంటూ గతంలోనే ప్రచారం జరిగింది.
ఈహతే బాహుబలికి మూడవ పార్ట్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కూడా డిమాండ్స్ వచ్చాయి. బాహుబలి 3 కథ రాయమంటే రాస్తానంటూ గతంలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ సందర్భంలో అన్నారు. బాహుబలి 3 ఫ్యూచర్ లో ఖచ్చితంగా వర్కౌట్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయం గురించి దర్శకధీరుడికి ఒక ప్రశ్న ఎదురయ్యింది. ఇప్పుడు ఆ విషయం ప్రభాస్ వైపు డైవర్ట్ అవుతోంది. అయితే రాజమౌళి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా ఈసినిమా వర్కౌట్ చేస్తారేమో కాని మరోవైపు ప్రభాస్ మాత్రం బాహుబలి 3 అంటేనే అమ్మో అంటున్నారు. ఈ విషయాన్ని
ప్రభాస్ పబ్లిక్ గానే అన్నారు. ఓ సారి రాజమౌళి రానా హోస్టింగ్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వెళ్ళారు. అయితే అక్కడ రాజమౌళికి బాహుబలి3 గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఈ విషయంలో ప్రభాస్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని రానా ప్రభాస్ కు రాజమౌళి చేత ఫ్రాక్ కాల్ చేస్తారు. అయితే ఫోన్లో ప్రభాస్.. రాజమౌళి ప్రపోజల్ కు షాక్ అయ్యారు. డార్లింగ్ బాహుబలి 3.. చేద్దాం రెడీగా ఉండు అనగానే స్టార్ట్ చేద్దాం అని జక్కన్న ఫోన్ లో అనగానే.. అమ్మనీయమ్మ అంటూ ప్రభాస్ బాబోయ్ అంటూ.. ప్రభాస్ నావల్ల కాదు అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు. దాంతో షోలో ఉన్న ఆడియన్స్ షాక్ అవ్వడంతో పాటు ఆశ్చర్యపోయారు.
ఇక ప్రభాస్ ఈ విషయం సరదాకి అన్నారా.. లేకపోతే నిజంగా బాహుబలి 3 ఉందంటూ.. షాక్ అయ్యారా లేదా చేయడానికి ఉత్సాహపడ్డారా.. అనే విషయం మాత్రం తెలియలేదు. కాని ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా కోసం బిజీ గా ఉన్నారు. ఈ సినిమా పూర్తవడానికి కనీసం 3 ఏళ్ళు పట్టొచ్చు మరోవైపు ప్రభాస్ చేతిలో 5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.. ప్రభాస్ కూడా ఇప్పట్లో తన కాల్షీట్స్ ఏ మాత్రం ఖాళి లేదు కాబట్టి.. ఈ ఐదారేళ్ళలో బాహుబలి 3 కి అవకాశం లేదు అనే చెప్పాలి. కాని ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ బాహుబలి కి ౩వ పార్ట్ వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.
For more updates: The Film Nagar