రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ అరియానా తో ఎఫైర్..? సంచలన విషయాలు బయట పెట్టిన లావణ్య..!
గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికి రాజ్ తరుణ్ తనకి కావాలని, అతడిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాని లావణ్య మీడియాతో ఓపెన్ గానే చెబుతున్నారు. రాజ్ తరుణ్ తాను మాట్లాడిన ఆడియో కాల్స్.. చాటింగ్స్ ఇలా పలు రకాల ఆధారాలని లావణ్య బయట పెడుతున్నారు.
హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రాను రాను పెను తుఫాన్ లాగా మారుతోంది. రాజ్ తరుణ్ చాలా పెద్ద సమస్యల్లో పడబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్ళకి పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని దూరం పెడ్తున్నాడు అని లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ తనకి ఇప్పటికీ కావాలని, అతడిని ఇప్పటికి ప్రేమిస్తున్నాని లావణ్య మీడియాతో చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మరోవైపు ఒక వార్త సంచలనం రేపుతోంది, రాజ్ తరుణ్ కి ఇది పెద్ద తల నొప్పిగా మారే అంశంగా కూడా ఉంది
అదేంటంటే రాజ్ తరుణ్ లావణ్యకి రెండు సార్లు అబార్షన్ చేయించాడట. వాటికి సంబందించిన వివరాలని ఆధారాలతో సహా లావణ్య బయటపెట్టారు. మరోపక్క రాజ్ తరుణ్ కూడా లావణ్యపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు లావణ్య మాత్రం మీడియాకి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ మరికొన్ని విషయాలు బయటకి చెప్పుకొస్తుంది. కొంతమంది హీరోయిన్లతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకోవడం వల్ల తనని పట్టించుకోవడం లేదని లావణ్య అంటోంది. ఆ హీరోయిన్ల పేర్లు కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది. హీరోయిన్లు షాలిని పాండే, రిద్దీ కుమార్, మాల్వి మల్హోత్రా తో పాటు బిగ్ బాస్ అరియానాతో కూడా రాజ్ తరుణ్ కి ఎఫైర్ ఉన్నట్లు ఆమె తెలిపారు.రాజ్ తరుణ్ తో అరియానా ఎఫైర్ పెట్టుకున్నట్లు మీకు ఎలా తెలుసు అన్న యాంకర్ ప్రశ్నకి లావణ్య సమాధానం ఇచ్చింది. అరియానాతో ఎఫైర్ మొదలైన తర్వాత రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదు. అరియానా నాతో ప్రవర్తించే విధానంలో కూడా మార్పు వచ్చిందని.
మణికొండలో నివాసం ఉంటున్న అరియానా అపార్ట్మెంట్ కి రాజ్ వెళ్ళేవాడని. అపార్ట్మెంట్ లో కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళిద్దరు ఉన్న ఫోటోలు కూడా నేను చూసాను. ఒకరోజు నేను గోవాలో ఉన్నప్పుడు రాజ్ ఫోన్ నుంచి నాకు అరియనా కాల్ చేసి చాలా అసభ్యంగా మాట్లాడింది. నీకు శాలరీ ఎంత అని అడిగింది..ఇదే బిగినింగ్ కదా తక్కువ వస్తుంది అని చెప్పాను.. అవునా.. నాకైతే రోజుకి 50 వేల నుంచి లక్ష వరకు వస్తుంది అంటూ తక్కువ చేసి మాట్లాడింది.
అప్పుడే నాకు అర్థం అయిన విషయం ఏంటంటే.. నాకు కౌంటర్ ఇవ్వడానికి రాజ్.. అరియానాని వాడుకున్నాడు అని అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత నేను అరియానా కి గట్టిగ వార్నింగ్ ఇవ్వడంతో. దీనితో అరియానా నాకు సారీ కూడా చెప్పింది అని ఆ కాల్ రికార్డ్స్ కూడా తన వద్ద ఉన్నాయని లావణ్య షాకిచ్చింది.
For more Updates: The Film Nagar