చాలా ఇబ్బంది పడ్డాను – జాన్వీ కపూర్
పని కంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధ్యాన్యమివ్వాలని జాన్వీ కపూర్ అన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల ఆమె ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందడం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి జాన్వీకపూర్( Janhvi Kapoor) ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. ఎంతో ఇబ్బందిపడినట్లు తేలిపారు. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ‘ఇటీవల కాలంలో వరుస షూటింగ్లు, ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాను. విరామం లేకుండా వరుస ప్రయాణాలు చేశాను. షూటింగ్లలో పాల్గొన్నాను. దీంతో వీక్ అయ్యాను. ఓ పాట షూటింగ్లో పాల్గొనడం కోసం చైన్నై వెళ్లా. అక్కడ చాలాసార్లు బయట తిన్నాను. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత పూర్తిగా నీరసించిపోయా భరించలేనంత నొప్పి రావటం. టెన్షన్ పడ్డాను. హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతానికి గురయ్యానా అనే భావన కలిగింది. సాయం లేకుండా వాష్రూమ్కు కూడా వెళ్లలేకపోయాను. నడవడానికి కూడా ఓపిక లేదనిపించింది. ఆసుపత్రికి వెళ్లి మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నాను. మనం అన్నిటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అర్ధం చేసుకున్నా. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో, లేదో అని భయపడ్డా. ఇప్పుడు మళ్ళీ వర్క్ బిజీ అవుతున్నాను. ఇప్పటికీ పూర్తి ఓపిక రాలేదు’ అని చెప్పారు.
ప్రస్తుతం జాన్వీ ‘ఉలయ్’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రంగా ఇది సిద్ధమైంది. సుధాన్షు సరియా దర్శకుడు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి టాక్ సొంతం’ చేసుకుంది.
For more updates: The Film Nagar