ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు)
2023 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. ఈ అవార్డుల్లో దక్షిణాది నాలుగు భాషల్లో 2022లో విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 7 అవార్డులు దక్కాయి. సీతారామం సినిమాకు 5, విరాటపర్వం సినిమాకు 2, మరియు ‘భీమ్లా నాయక్’ సినిమాకు ఒక అవార్డు వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటికీ ఏదో ఒక అవార్డు గెలుచుకోవడం విశేషం. వివిధ విభాగాల్లో అవార్డు పొందిన వారిని కింద చూడవచ్చు.
ఉత్తమ సినిమా: ఆర్ఆర్ఆర్
ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి
ఉత్తమ మూవీ (క్రిటిక్స్): సీతారామం
ఉత్తమ నటుడు: రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్): సాయిపల్లవి (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ నటి: నందితా దాస్ (విరాటపర్వం)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి – కానున్న కల్యాణం (సీతారామం)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు): కాల బైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడే)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ): చిన్మయి (సీతారామం – ఓ ప్రేమ)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ – నాటు నాటు)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
For More Updates Follow The Film Nagar