“కల్కి” గురించి అమితాబ్ మాటల్లో…! ఏమన్నారంటే.?
నాగ్ అశ్విన్ – ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఆయన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఆయన చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. దీన్ని ఆదరించి ఘన విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
‘నాగ్ అశ్విన్ తీసిన ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. 6000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథని నేటి సమాజానికి అందించాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన. 2024లో ఈ సినిమాని తెరకెక్కించాలనుకోవడం ఆయన చేసిన సాహసం. లక్షల శ్లోకాలతో కూడిన పౌరాణిక ఇతిహాసం మహాభారతాన్ని అద్భుతంగా వివరించినందుకు తొలుత నిర్మాణసంస్థకు ధన్యవాదాలు. నేను ఈ దర్శకనిర్మాతల నుంచి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. కురుక్షేత్రం యుద్ధం తర్వాత ఏం జరిగింది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘కల్కి’ చూసిన వారంతా దాని రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని అయన పేర్కొన్నారు. ఆ కథ మీ అంచనాలకు మించి ఉంటుంది. నేను ‘కల్కి 2898 AD’ చిత్రం గురించి నాగ్ అశ్విన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాను. అది త్వరలోనే టెలికాస్ట్ అవుతుంది” అని అమితాబ్ వెల్లడించారు.
For More updates : The Film Nagar