ప్రభాస్‌పై అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్ .. ఇండైరెక్ట్‌గా బన్నీకి సెటైర్ వేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్
అల్లు శిరీష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ బడ్డీ. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పలు యూట్యూబ్ ఛానల్స్‌కి అల్లు శిరీష్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలీకుండానే శిరీష్.. అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్‌పై అల్లు శిరీష్ కామెంట్స్
అల్లు అర్జున్ బ్రదర్ శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘బడ్డీ’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టెడ్డీ బేర్ కాన్సెప్ట్‌తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తియ్యడం జరిగింది.గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా యూట్యూబ్ ఛానల్స్‌కి అల్లు శిరీష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్‌ను తెగ పొగిడారు శిరీష్. అయితే ఈ కామెంట్స్ ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్‌కి సెటైర్ వేసినట్లుగా ఉన్నాయంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి
మీరు కంటిన్యూగా ఎందుకు సినిమాలు చేయడం లేదు.. అలానే సెపరేట్‌గా మీకు పీఆర్ టీమ్ పెట్టుకోవచ్చు కదా అంటూ శిరీష్‌ను యాంకర్ అడిగారు. దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ గురించి ప్రస్తావించారు శిరీష్. “కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటే ఆడియన్స్‌యే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మన గురించి మనం చెప్పుకో అక్కర్లేదు. సినిమాలే చెబుతాయి. ఈ విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి. ఆయన అసలు ఎక్కడా కనపడరు. సింప్లిసిటీకి అతను పెద్ద ఎగ్జాంపుల్. ఆయన చేసేవన్నీ పెద్ద సినిమాలు.. అన్నీ బావుంటాయి. బయట ఎక్కడా కనపడరు.. ఎలాంటి హడావిడి ఉండదు. ఆయన నుంచి ఇలాంటివి నేర్చుకోవాలి. అసలు ఆయనకి పీఆర్ కూడా లేదు. అలానే ఏ అవార్డ్ ఫంక్షన్స్‌కి, రియాలిటీ షోలకి కూడా ఆయన పెద్దగా రారు.
అయినా కల్కి 2898 ఏడీ సినిమా కోసం బుజ్జి అనే కారుతో ఒక ఈవెంట్, ఫుల్ క్యాస్ట్‌తో ఒక ఇంటర్వ్యూ, ఇన్‌స్టాలో ప్రమోషన్స్ ప్రభాస్ చేశాడంటూ బన్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అలానే మిర్చి సినిమా టైమ్‌లో ఢీ షోకి కూడా ప్రభాస్ గెస్టుగా వచ్చాడంటూ చెబుతున్నారు.
For More Updates Follow The Film Nagar .