సోషల్ మీడియా పై నిఘా పెట్టడమే – తమన్నా
పదిహేను సెకన్ల రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడమే ఇప్పుడు నటీనటులకు అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పాలి’ అని అంటోంది కధానాయిక తమన్నా.. ఇటీవలి కాలంలో ప్రత్యేక గీతాలు, విభిన్నమైన జానర్ చిత్రాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె. కాలం మారింది మనం కూడా మారాలంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఎలాంటి సవాళ్లు ఎదురైనా నటిని కావాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, సినీతారగా ఎదగాలన్న కల కోసం వందశాతం కష్టపడి పనిచేశా. అనుకున్నది సాదించానన్న ఆనందం, సంతృప్తి రెండూ నా సినీ ప్రయాణంలో ఉన్నాయి’ అని అంది ‘ఒకప్పుడు థియేటర్స్లోనే సినిమాల హవా ఉండేది. ఇప్పుడు కాలం మారింది ఓటిటి వేదికగా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటివైపే మొగ్గు చూపుతున్నారు కొందరు. కేవలం ఓటీటీ ప్రాజెక్టులే కాదు.. సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేస్తున్న పదిహేను సెకన్ల రీల్స్ కూడా ఆకర్షిస్తున్నాయి. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు, వారికి నచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావడమే నాయకానాయికలకు సవాలుగా మారింది. ఆ రీల్చే పెద్ద పోటీగా నిలిచాయి అంటూ ముచ్చటించింది తమన్నా
మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకూ తన ప్రయాణం ఎలా జరిగింది దాని గురించి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచే నటిని కావాలనుకున్నా. ఆ కలను నెరవేర్చుకోవటానికి తీసుకున్న నిర్ణయాలు నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్తాయనేది తెలియకుండానే చిత్రపరిశ్రమలో అడుగు పెట్టా అంటున్న తమన్నా
For More Updates Follow The Film Nagar