రాజమౌళి – మహేష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్

గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి – మహేష్ బాబు సినిమా కోసం తాను జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ అవుతుంది అని ఇటీవల ఎం.ఎం. కీరవాణి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకోవైపు పాత్రలు, ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి స్క్రీన్ టెస్ట్‌ షూట్స్‌ కూడా చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించే విలన్స్ కోసం ప్రత్యేకంగా వేషధారణలు అండ్ సెట్ లను రాజమౌళి డిజైన్ చేయిస్తున్నారని.. అలాగే, మహేష్ తో పాటు మిగిలిన ప్రధాన నటీనటులు లుక్స్ విషయంలో కూడా రాజమౌళి ప్రస్తుతం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు వినికిడి.

ఐతే ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లాక్‌ అయ్యిందట . ప్రస్తుతం రాజమౌళి & టీమ్ డైలాగ్స్ పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందాని టాక్. మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది అని అంటున్నారు. కాగా తెలుగు నటీనటులు మాత్రమే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు అని సమాచారం. అలాగే, ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా హాలీవుడ్ కి చెందిన చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు సమాచారం.

For More Update Follow The Film Nagar

  • Related Posts

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Vijayashanti Slams Negativity at Arjun S/O Vyjayanthi Success Meet

    Vijayashanti Slams Negativity at Arjun S/O Vyjayanthi Success Meet

    Meet Vijay Polaki, The Rising Dance Choreographer in Tollywood

    Meet Vijay Polaki, The Rising Dance Choreographer in Tollywood

    Jr NTR to Attend Arjun S/o Vyjayanthi Event

    Jr NTR to Attend Arjun S/o Vyjayanthi Event

    Non Spoiler Review Of The Film Court

    Non Spoiler Review Of The Film Court

    Salman Khan and the Blackbuck Poaching Controversy

    Salman Khan and the Blackbuck Poaching Controversy